పండుగ పూట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

పండుగ పూట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR 30. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంద. ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఆగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు కొత్త ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా పట్టలెక్కనుంది. కొత్త ఏడాది కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. 2024, ఏప్రిల్ 5 న ఈ చిత్రం థియేటర్ లో సందడి చేస్తున్నట్లు తెలిపారు.

ఇక పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ కనిపించలేదు కానీ రెండు చేతుల్లో తారక్ కత్తులు పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తోంది. ” ఒక మనిషికి ధైర్యం అనే వ్యాధి ఉంటే.. దానికి భయమే నివారణ” అంటూ ఒక్క లైన్ లో కథను చెప్పుకొచ్చాడు కొరటాల. ఇక ఈ సినిమాకు తమిళ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. అయితే హీరోయిన్ ఎవరో ఇప్పటివరకు చెప్పకపోవడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారమే సినిమా తో బాలీవుడ్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం తారక్ తెరపై కనిపించడు అని బాధపడుతున్నారు. ఈరోజు అప్డేట్ ఇచ్చినందుకు సంతోషపడాలో.. తారక్ ఈ ఏడాది కనిపించడు అని బాధపడాలో తెలియడం లేదని అభిమానులు అంటున్నారు. మరి ఈ ఏడాది కనీసం టీజర్ లు, పోస్టర్లు అయినా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

follow us