యాంగ్రీ హీరో కార్తీ ‘ఖైదీ’ సెన్సార్‌ పూర్తి – అక్టోబర్‌ 25 విడుదల

  • Written By: Last Updated:
యాంగ్రీ హీరో కార్తీ ‘ఖైదీ’ సెన్సార్‌ పూర్తి – అక్టోబర్‌ 25 విడుదల

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’ఖైదీ’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ “ఖైదీ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 25న విడుదల చేస్తున్నాం. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సాగే వెరైటీ సినిమా ఇది. విభిన్నమైన చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ‘ఖైదీ’ చిత్రానికి కూడా అఖండ విజయాన్ని చేకూరుస్తారన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆరట్స్‌ బేనర్‌పై ’ఖైదీ’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌, రిలీజ్‌: శ్రీసత్యసాయి ఆరట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

Tags

follow us

Web Stories