“18 పేజిస్” చిత్రం నుండి “నన్నయ్య రాసిన” లిరికల్ వీడియో విడుదల

  • Written By: Last Updated:
“18 పేజిస్” చిత్రం నుండి “నన్నయ్య రాసిన” లిరికల్ వీడియో విడుదల

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. మాములు చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు థియేటర్స్ ను, కలక్షన్స్ ను పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని సాధించింది. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ “18 పేజిస్” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంను డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

“18 పేజిస్” చిత్రం నుండి విడుదలకాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి “నన్నయ్య రాసిన” అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

follow us