18 పేజెస్ ట్రైలర్ డేట్ ఫిక్స్

18 పేజెస్ ట్రైలర్ డేట్ ఫిక్స్

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్…త్వరలో 18 పేజెస్ మూవీ తో డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో అనుపమ మరోసారి నిఖిల్ తో జోడి కట్టడం విశేషం. “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

డిసెంబర్ 17న ట్రైలర్ రాబోతున్నట్టు పుస్తకంలోని పేజీపై డిస్‌ప్లే చేస్తూ సరికొత్తగా ప్రకటించారు. 18 పేజెస్‌ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 18 పేజెస్‌లో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పోస్ట్‌ థ్రియాట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. 18 పేజెస్‌ పోస్ట్‌ థ్రియాట్రికల్‌ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌, ఆహా.. శాటిలైట్‌ రైట్స్ ను జీ ఛానల్‌ దక్కించుకున్నట్టు వినికిడి.

follow us