2020 : టాలీవుడ్ సినీ ప్రేమికులకు పండగే.

2020 : టాలీవుడ్ సినీ ప్రేమికులకు పండగే.

2020 లో టాలీవుడ్ సినీ ప్రేమికులకు పండగే.. అన్ని బడా సినిమాలు రాబోతున్నాయి.. ఇటు మెగా ఫ్యాన్స్ కి అటు నందమూరి ఫ్యాన్స్ కి కాకుండా అదరకొట్టడానికి రెడీ అయ్యి పోతున్నారు అందరూ.. 

సంక్రాంతికి మార్కెట్ ఇప్పటికే సెట్ అయ్యి పోయింది.. సరిలేరు నీకెవ్వరు , అలా  వైకుంఠపురం లో తో అల్లు అర్జున్, మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.. రజనీకాంత్ దర్బార్ కూడా రెండు దశాబ్దాల తరువాత పోలీస్ గేటప్ లో .. ఇంకా కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ వస్తున్నారు .

గణతంత్ర దినోత్సవం కి కూడా మార్కెట్ ఇప్పటికే సెట్ అయ్యిపోయింది.. రవి తేజ డిస్కో రాజా తో తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు.. 

నితిన్ , రష్మిక మండన్న ల క్రేజీ కాంబినేషన్ లో భీష్మ వస్తుంది.. ఈ సినిమా మీద నితిన్ చాలానే అసలు పెట్టుకున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయినా బైట్ రష్మిక నడుము మీద బాగానే క్రేజ్ కూడా  తెచ్చుకుంది.. 

ఇవి అన్ని ఇలా ఉంటే వచ్చే సినిమాలు ఏంటో చూద్దాం.. 

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వాలెంటైన్స్ డే రోజున వస్తున్నాడు.. పూరి దర్శకత్వం లో జాహ్ణవి కపూర్ హీరోయిన్ గా ఫైటర్ తో కరణ్ జోహార్ నిర్మాణం లో క్రేజీ సినిమా చేస్తున్నాడు.. 

సమంత శర్వానంద్ 96 రీమేక్ సినిమా కూడా మార్చి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. 

2020 లో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా RRR . తారక్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ అలానే రాజమౌళి దర్శకత్వం లో బాహుబలి తరువాత వస్తున్న సినిమా ఇది.. జూన్ 2020 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

చిరంజీవి : ఈ సంవత్సరం లో నిరాశ పరిచిన కానీ 2020 లో ఆయన చేస్తున్న సినిమా కొరటాల శివ దర్శకత్వం లో అది పక్క హిట్ బొమ్మే.. ఎందుకు అంటే బడ్జెట్ దగ్గర నుంచి కథ , క్యాస్టింగ్ దగ్గర వరకు అన్ని చిరంజీవి కొరటాల దగ్గర ఉండి చూసుకుంటున్నారు.. 

బాలయ్య : బాలయ్య బాబు ఆయన ట్రెండ్ సెట్టర్ దర్శకుడు బోయపాటి తో సినిమా చేస్తున్నారు.. వీళ్ళ కాంబినేషన్ మీద ఫ్యాన్స్ కి ఎంతో నమ్మకం ఈ సినిమా బాల్లయ్య కే కాదు బోయపాటికి కూడా చాలా ముఖ్యం.. 2019 లో 3 డిజాస్టర్స్ ముట  కట్టుకున్న బాలయ్య 2020 లో ఈ సినిమా పక్కా హిట్ బొమ్మే.. 
అల్లు అర్జున్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో ఎర్ర చందనం స్ముగ్గ్లింగ్ మీద  చేస్తున్నారు.. కాస్టింగ్ తోనే క్రేజ్ తెచ్చుకున్నారు ,  హీరోయిన్ గా రష్మిక..  విల్లన్ పాత్ర లో విజయ్ సేతుపతి, నిహారిక కూడా ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. 

ప్రభాస్ జాన్ క్రేజ్ తెచ్చుకుంది కానీ .. సినిమా షూటింగ్ కు మాత్రం అప్పటికప్పుడు బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి .. పూజ హెగ్డే హీరోయిన్ ఈ సినిమా లో.. జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ సినిమా కి దర్శకుడు.. ఈ సినిమా 2020 రావడం కాయం కానీ.. అది ఎలా అన్నది ప్రభాస్ చేతులలోనే ఉన్నదీ.. 

ఇంకా అక్కినేని వారసులు ఇద్దరు ఈ ఇయర్ బిజీ.. నాగ చైతన్య  శేఖర్ కముల దర్శకత్వం లో ఒక సినిమా అలానే పరుశురాం తో ఇంకోటి చేస్తున్నాడు.. అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వం లో వస్తున్నాడు, ఈ సినిమా తో అయినా అఖిల్ కమర్షియల్ హిట్ అందుకుంటాడు అని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నాడు.. అక్కినేని ఫ్యాన్స్ కి ఒక రకంగా ఈ ఇయర్ పండగే.. కంఫర్మ్ గా 3 సినిమాలు చూడబోతున్నారు.. ఇంకా నాగ్ కూడా బాలీవుడ్ సినిమా భ్రమస్త్ర తో రాబోతున్నాడు.. 

కెజిఫ్ 2 కూడా ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. కెజిఫ్ కన్నడ సినిమా ఒక్కసారిగా ఈ సినిమా హిట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతి స్టార్ హీరో కి కావాల్సిన దర్శకుడు అయ్యి పోయాడు.. దానికే కెజిఫ్ 2  పాన్ ఇండియా సినిమా గా  రూపుదిద్దుకుంటుంది..

అనుష్క సైలెన్స్ ఇంకా  కీర్తి సురేష్ మిస్ ఇండియా కూడా ఈ 2020 లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.. 

13 ఏళ్లగా ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం లో అయినా మన మోక్షజ్ఞ బాబు కరుణిస్తాడు ఏమో చూద్దాం.. 

చూస్తుంటే ఈ 2020 టాలీవుడ్ ప్రేమికులని  బాగానే రక్తికట్టించేలా ఉంది.. 

Tags

follow us

Web Stories