సూపర్ స్టార్ 28 యేళ్ళ సినీ కెరీర్

సూపర్ స్టార్ 28 యేళ్ళ సినీ కెరీర్

తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒక్కడు. 10 సంవత్సరాల వయసులో బాల నటుడిగా వెట్రీ అనే సినిమా తో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతు ఇప్పటివరకు 64 సినిమాల్లో నటించాడు. సైమా అవార్డ్స్, విజయ్ అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఎన్నో గెలుచుకున్నాడు.

బాలనటుడిగా సినిమాకు పరిచయం అయిన విజయ్ నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. “28 ఇయర్స్ ఆఫ్ విజయ్ ఇజమ్” (#28YearsOfVIJAYISM) అనే హ్యాష్ టాగ్ తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నారు. ఇక విజయ్ సినిమా విషయానికి వస్తే గత కొన్ని యేండ్లుగా ఓటమి అంటే ఏమిటో తెలియకుండా వరస విజయాలతో వస్తున్నాడు. ప్రస్తుతం కార్తీ నటించిన ఖైదీ చిత్రా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదల కు సిద్దం అవ్వుతుంది.

follow us