థియేటర్ లలో సీటింగ్ కెపాసిటీ 50 శాతమే..!

50 percent seating capacity in karnataka theaters
50 percent seating capacity in karnataka theaters

కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేవలం ఈరోజు ఒక్కరోజే దేశంలో 1 లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా కేరళ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు ,కర్ణాటక వరుస రెండు మూడు నాలుగు ఐదో స్థానాల్లో ఉన్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో థియేటర్ లకు 50 శాతం మాత్రమే సీటింగ్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్ డౌన్ తో మూత పడిన థియేటర్ లు ఇటీవలే తెరుచుకున్నాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన అనంతరం 100 శాతం సీటింగ్ కు అనుమతులు ఇచ్చారు. ఇక ఇప్పుడు మళ్లీ సీటింగ్ కెపాసిటీ 50 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో కన్నడ సినీ పరిశ్రమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది కానీ సీఎం యడ్యూరప్ప పట్టించుకోలేదు.