‘7/G బృందావ‌న కాల‌నీ’ కి సీక్వెల్ రాబోతుందట…

‘7/G బృందావ‌న కాల‌నీ’ కి సీక్వెల్ రాబోతుందట…

‘7/G బృందావ‌న కాల‌నీ’ ఈ పేరు వింటే చాలు యూత్ లో మంచి కిక్ వస్తుంది. 2004 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళం, తెలుగులో వచ్చిన ద్విభాషా ప్రేమ కథా చిత్రం ఇది. నిర్మాత యైన ఎ. ఎం. రత్నం తనయుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అనేది ఉండదు. ఎక్కడా కృత్రిమంగా కనిపించదు. మాటలు, చేతలు.. ఇలా అన్నీ సహజంగా ఉంటాయి. హీరోయిన్‌ను, హీరోను మన పక్కింటిలోనో, వీధి చివరనో, పక్క వీధిలోనో చూసినట్లు ఉంటుంది. అందుకే ఆ సినిమా అంత విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత హీరో, హీరోయిన్‌కు పెద్దగా అవకాశాలు రాకపోయినా.. సినిమా మాత్రం మనకు ఇంకా గుర్తుండిపోయింది. అందుకే కావొచ్చు ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తున్నామని నిర్మాత ఎ.ఎం.ర‌త్నం అధికారికంగా ప్రకటించారు. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? హీరో హీరోయిన్ల సంగతేంటి? అనేది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రానికి తొలి సినిమాను డైరక్ట్‌ చేసిన సెల్వ రాఘ‌వ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో నటించిన సోనియా అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. రవికృష్ణ అయితే కనిపించడం లేదు. మరిప్పుడు కొత్త సినిమా కోసం ఎ.ఎం.రత్నం ఎవరిని తీసుకొస్తారో చూడాలి.

follow us

Related News