90 ML రివ్యూ

90ML Movie Review
90ML Movie Review

CCC Rating : 2/5

నటీనటలు: కార్తికేయ, నేహా సోలంకి, ప్రగతి, రావు రమేష్, రవి కిషన్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్ పాట‌.లు : చంద్రబోస్ కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శేఖర్ రెడ్డి

తెలుగు సినిమా తీసే దర్శకులకి ఈ మధ్య ఒక జబ్బు ని తీసుకొని అది హీరోకి పెట్టేసి సినిమా తీయడం బాగా అలవాటు అయ్యింది.. ప్రేక్షకులు కూడా హీరో తనకి ఉన్న వ్యాధి వాళ్ళ ఇబ్బంది పడటం దాని నుంచి వచ్చే వినోదం కి సినిమా కి మార్కులు వేస్తున్నారు.. 

మన 90 ML లో హర్ “ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్” అనే వ్యాధి తో పుడతాడు.. డాక్టర్లు ఈయనకి రోజు మూడు పూతల మూడు 90 ML తాగించాలి తాగక పోతే మన హీరో బతకడం కష్టం అని తేల్చేస్తారు.. కథ వింటుంటే కిక్ వస్తుంది కానీ సినిమా లో అవి ఏమి కనిపించవు… హీరో పెరిగి పెద్ద అయ్యాక తనకి ఉన్న వ్యాధి వల్ల తనకి ఎవరు ఉద్యోగం ఇవ్వరు 90% మార్కులు ఉన్న ఉద్యోగం రాదు .. కనిపించిన ప్రతి ఒక్కరికి మన హీరో నేను అథరైజ్‌డ్  డ్రింకేర్ ని అని చెప్పుకుంటూ తిరుగుతాడు..

ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అసలు తాగుబోతు అన్న మాటే వినిపించదు.. అలాంటి ఆమె ని మన హీరో లవ్ చేస్తాడు.. ఆమెకి చెప్పకుండా దాచుతాడు.. వాటి వల్ల వచ్చే ఇబ్బందులే సినిమా.. హీరోయిన్ అక్కడ అక్కడ అందం గా ఉన్న. తేలిపోయింది మన హీరో పక్కన.. 

సినిమా లో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఇలాంటి వాటిలో ప్రేక్షకులు చూసేది కామెడీ.. అలాంటిది కామెడీ తక్కువ.. హీరో  కామెడీ చెయ్యాలి అనుకున్న ప్రతి చోట అది  మన హీరో యాక్షన్ నేర్చుకోవాలి అని చెప్పినట్టు ఉంటుంది.. డాన్సులు ఎమోషనల్ సీన్స్ లో మాత్రం కార్తికేయ ఇరగదీసాడు అనే చెప్పాలి.. 
ఇంకా విలన్ ఆయన బైబిల్ లో వాక్యాలు అంతో.. తాగక గుర్తు ఉండక పోవడం.. ఆయన విచిత్ర వేష ధారణ .. ఇవి అన్ని దర్శకుడు కామెడీ కోసం చేసాడు ఏమో కానీ విలన్ ని తేలి పోయాడు ఈ పిచ్చి పనులు వల్ల .. 

ఫస్ట్ హాఫ్ ఒక రకంగా కస్టపడి చుసిన కానీ.. సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి సినిమా ఇంకా ఎందుకు అవ్వలేదు అనే డౌట్ కూడా వచ్చేస్తుంది.. డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ మంచిదే అలా అని పాట లవ్ స్టోరీ నే చెప్తా అంటే ఎలా.. ఆర్థరైజ్డ్ డ్రింకేర్ అనే కాన్సెప్ట్ వల్ల  సినిమా మొదలు అయినా ఫస్ట్ పది నిముషాలు బాగుంది. అంతకు మించి చెప్పుకోడానికి ఏమి లేదు.. పాటలు కూడా ఎవో ఉన్నాయ్ అంటే.. అనూప్ రూబెన్స్ అంత మెప్పించలేక పోయారు.. 

CCC Rating : 2/5