క్షితిజ్ రవి ప్రసాద్ కు బెయిల్ మంజూరు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ కు సంబందించిన డ్రగ్స్ వ్యవహారం ఆ మధ్య ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. అందులో పలువురి ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ధర్మ ప్రొడక్షన్ కు సంబందించిన సహా నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్ ను ఎన్ సి బి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఎన్‌డిపిఎస్ కోర్ట్ బెల్ మంజూరు చేసింది. కానీ 50 వెల రూపాయలను మరియు తన పాస్ పోర్ట్ ను బెయిల్ కోసం జత చెయ్యాలని కోర్టు సూచించింది.
బెయిల్ మంజూరు అయిన ఆయన విడుదల మాత్రం ఆలస్యం అవ్వుతుంది. ఎందుకు అనగా అతను మరో కేస్ లో నిందితుడుగా ఉన్నాడు. ఆ కేస్ విచరణా వచ్చే నెల 3 న జరగనున్నది. క్షితిజ్ రవి ప్రసాద్ యొక్క లాయర్ తన క్లయింట్ ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ పేరును డ్రగ్స్ వ్యవహారం తో అతనికి కూడా సంబందం ఉన్నది అన్నట్లుగా చెప్పి, అతని పేరును చెప్పమని క్షితిజ్ రవి ప్రసాద్ కు చెప్పినట్లుగా ఎన్సి బి విచారణలో తేలింది. మొదటగా డ్రగ్స్ వ్యవహారం లో క్షితిజ్ రవి ప్రసాద్ అరెస్ట్ అయ్యారు.