హాలీవుడ్ కి వెళ్ళుతున్న మురుగదాస్ !

హాలీవుడ్ కి వెళ్ళుతున్న మురుగదాస్ !

తమిళ్ దర్శకుడు మురగదాస్ తదుపరి చెయ్యాబోయే సినిమాపై ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. తమిళ్ హీరో విజయ్ కు తుపాకి, కత్తి, సర్కార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. వీరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని, ఓ పెద్ద ప్రాజెక్ట్ గురుంచి విజయ్ తో చర్చలు జరిపాడని వార్తలు వచ్చిన అవి వట్టి ఊహాగానాలనే తేలింది. తాజా సమాచారం మేరకు వాల్ డిస్ని హాలీవుడ్ లో ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ చిత్రం కోసం ఏ.ఆర్. మురగదాస్ పనిచెయ్యనున్నట్లుగా తెలుస్తుంది.

ఎప్పటినుండో ఓ భారీ లైవ్ యాక్షన్ సినిమాను హాలీవుడ్ లో తియ్యాలనేది మురగదాస్ కోరిక. అందుకే విజయ్ తో చెయ్యాలిసిన ప్రొజెక్ట్ ను పక్కన పెట్టి హాలీవుడ్ సినిమాపై మురగదాస్ దృష్టి పెట్టినట్లు గా సమాచారం. మురగదాస్ హాలీవుడ్ సినిమా చేస్తున్నాడనే వార్తలు వస్తుండటంతో ఆయన సినిమాలు అభిమానించే అభిమానులు అక్కడ కూడా సక్సెస్ కొడతాడని అంటున్నారు. ఈ ఏడాది రజినీకాంత్ తో దర్బార్ తీసి హిట్ కొట్టాడు. తెలుగులో మహేష్ బాబు తో స్పైడర్ తీసి నిరాశ పరిచాడు.

follow us