సెప్టెంబర్ 9న రింగులోకి దిగుతున్న “లైగర్”.!

  • Written By: Last Updated:
సెప్టెంబర్ 9న రింగులోకి దిగుతున్న “లైగర్”.!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ డైరెక్టర్ పూరిజగన్నాత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “లైగర్”. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తోంది. ఈ సినిమాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రాన్ని ధర్మా మూవీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. పూరిజగన్నాథ్ కు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఒకరేంజ్ లో ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాను సంబందించిన పోస్టర్స్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. సినిమాను 2021 సెప్టెంబర్ 9న థియేటర్ లలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. హిందీ,తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

follow us