పాన్ ఇండియా మూవీ తీయని వారు ఎవరు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అప్పుడు పాన్ ఇండియా సినిమా తియ్యాలి అంటే బడ్జెట్ తో సహా ఆర్టిస్టులు, ప్రతి బాషా ను ఆకట్టుకునే కథ ఇలా చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు.. 

స్టార్ హీరో అయినా మహేష్ బాబు , అల్లు అర్జున్ కూడా ఇంతక వరకు ఒక పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు.. 

కానీ ఇప్పుడు OTT ల పుణ్యమా అని ప్రతి చిన్న హీరో పాన్ ఇండియా సినిమా తీసేయాలని చూస్తున్నారు.. 

మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి అంటూ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే .. ఇప్పుడు సాయి కుమార్ తనయుడు ఆది పాన్ ఇండియా సినిమా తీయబోతున్నారు.. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉండబోతుందని సమాచారం. బాల‌వీర్ అనే ఓ యువ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ ఆదికి బాగా నచ్చి తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు..