ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపటండి ?

  • Written By: Last Updated:
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపటండి ?

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటిస్తున్నతాజా చిత్రం “బాబ్ బిస్వాన్”. ప్రస్తుతం కోలకతా లో షూటింగ్ జరుపుకుంటుంది. “కహానీ” చిత్రంలో ఓ పాత్రను లీడ్ గా చేసుకుని అభిషేక్ నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం మంచి విజయం సాదించింది. ఆ చిత్రంలో సైకో కిల్లర్ పాత్రలో బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ నటించాడు. ఆయనకు ఆ పాత్ర మంచి పేరు తెచ్చింది. విమర్శకులు కూడా ప్రశంశించారు. అందులోని సైకో కిల్లర్ పాత్రను “బాబ్ బిస్వాన్” లో అభిషేక్ నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రంలోని అభిషేక్ ఫోటోస్ వైరల్ అవ్వుతున్నాయి. తాజాగా ఆయన “బట్ట తలతో స్లివ్ లెస్ చొక్కా ధరించి, పెద్ద కళ్ళద్దాలు పెట్టి కోర్టు కు హాజరు” అవ్వుతున్నట్లు గా కొన్ని ఫోటోస్ వైరల్ అవ్వుతున్నాయి. అభిషేక్ ఫోటోస్ తో సినిమా పై అంచనాలు పెరగనున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా చిత్రాంగద నటిస్తుంది. విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తుంది. షారుఖాన్ రెడ్ చిల్లీస్ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

follow us