స్పీకర్‌ ఫైర్… డోంట్ టాక్ రబ్బిష్…!

అసెంబ్లీలో టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం… సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఈ బిల్లులపై చర్చ జరుగుతోన్న సమయంలో.. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరారు స్పీకర్‌ తమ్మినేని… అయితే, స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్…‘సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా’ అంటూ మండిపడ్డారు.. ఇదే క్రమంలో సహనం కోల్పోయిన స్పీకర్… ‘డోంట్ టాక్ రబ్బిష్’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్, టీడీపీ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాన్ని కింది వీడియోలు చూడొచ్చు. 

Tags

follow us