సరిలేరు నీకెవ్వరు  : అటుఇటు అయితే

సరిలేరు నీకెవ్వరు  : అటుఇటు అయితే

మహేష్ బాబు తాజా నంటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు , అనిల్ రావిపూడి దర్శకత్వం లో రేపు విడుదల అవ్వబోతుంది..

అయితే ఈ సినిమా మహేష్ బాబు కి ఎంత ముఖ్యం అనేది పక్కన పెడితే అనిల్ రావిపూడి కి మాత్రం చాలా ముఖ్యం.. ఒక స్టార్ హీరో తో ఆయన ఇప్పటి దాకా  సినిమా చేయలేదు.. వెంకటేష్ తో చేసిన కానీ అది మాస్ సినిమా కాబట్టి పెద్దగా ఇబ్బంది పడి ఉండడు.. కానీ మహేష్ బాబు తో సినిమా అంటే ఆషా మాషి కాదు..

అందులోను మాస్ సినిమా అంటే చాలా కష్టం.. మహేష్ కి మాస్ ఫ్యాన్స్ తక్కువ.. ఆయన మాస్ సినిమాలు పోకిరి తప్ప ఇంకోటి హిట్ లేదు..

దూకుడు క్లాస్ టచ్ తోనే తీసాడు శ్రీను వైట్ల..కాబట్టి ఇది కచ్చితంగా యాసిడ్ టెస్ట్ అనిల్ కి..మహేష్ బాబు ఆగడు సినిమా ముందు చాలానే హోప్స్ ఉన్నాయి.. కానీ ఆ మాస్ ని జనాలు చూడలేకపోయారు.. తరువాత శ్రీను వైట్ల తో సినిమా తీయడానికి అసలు నిర్మాతలు ఎవరు ముందుకి రాలేదు..

అలానే  ‘అర్జున్’ సినిమా కూడా అంతే గుణ శేఖర్ కి చాలా పెద్ద దెబ్బ.. బ్రహ్మోత్సవం సినిమా తో శ్రీకాంత్ అడ్డాల ఒక పెద్ద హిట్ తరువాత భయంకరం అయిన డిజస్టర్ ఇచ్చాడు.. ఆ సినిమా కి కూడా చాలా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది.. సితార పాపా కూడా వచ్చి సినిమా ప్రమోట్ చేసింది.. ఇప్పుడు మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో , సినిమా అటు ఎటు అయితే అనిల్ రావిపూడి పరిస్థితి ఏంటి..

అన్ని కమర్షియల్ మాస్ మాసాల సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఎంత వరకు సక్సెస్ అవ్వుతాడో ఇంకా కొన్ని గంటలలో ప్రేక్షకులు డిసైడ్ చేయబోతున్నారు.. 

follow us

Web Stories