జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు

Actor Jaya Prakash Reddy Dies At 74
Actor Jaya Prakash Reddy Dies At 74

మన ఇంట్లో మనిషిలా కలిసి పోయిన జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. సినిమా ఇండస్ట్రీ లో వివాదరహితంగా బతికిన పెద్దమనిషి మన జయప్రకాశ్ రెడ్డి గారు ఆయన ఆకస్మిక మరణం తెలుగు ప్రేక్షకులకి తీరని లోటు ! జె.పి గారి ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ ఆయన గురించి కొన్ని విషయాలు..

వృత్తి రీత్యా టీచర్ అయినా ఆయనకు నటన మీద మక్కువ తో నాటకాలు వేసే వారు.. సురేష్ ప్రొడక్షన్స్ లో బ్రహ్మపుత్రుడు దగ్గర్నుంచి ప్రేమఖైదీ వరకు చాలా సినిమాల్లో నటించారు.. కానీ జయ ప్రకాష్ రెడ్డి కి గుర్తింపు దొరకక.. మళ్ళీ తిరిగి ఊరు వెళ్లి పోయి టీచర్ గా ఆయన వృత్తి ని కోనసాగించారు.. అపోలో ఆసుపత్రి లో మీత్రుడిని పరామర్శించడానికి వచ్చిన జె పి ని  అక్కడే డాక్టర్ ను కలవడానికి  వచ్చిన రామ నాయుడు గారు గుర్తుపట్టి  పిలిచి మాట్లాడారు.. అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాలు  చేసి ఉండడం తో రామ నాయుడు గుర్తు పట్టారు..

ఇక అనూహ్యం గా రామ నాయుడు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో విల్లన్ పాత్ర ను ఇచ్చారు.. అక్కడ నుంచి జె పి వెనకకు తిరిగి చూసుకోలేదు.. నటన పై మక్కువ తో ఇటీవలి కాలం లో సినిమాలో అవకాశాలు తగ్గినా కానీ ఆయనే సొంత ఖర్చులతో నాటకాలు ప్రదర్శించడం మొదలు పెట్టారు..

మన ఇంట్లో మనిషి గా అందరికి అలవాటు అయినా జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు..