కరోనాతో ప్రముఖ జర్నలిస్టు టీఎన్ఆర్ మృతి.. !

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా తో ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం టీఎన్ఆర్ సోదరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె వెంటిలేటర్ పై చికిత్స తీసుకుని భయటపడ్డారు. అనంతరం టీఎన్ఆర్ సైతం కరోనా బారిన పడ్డారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న తరవాత ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిన్న ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే విషాదకర వార్త భయటకు వచ్చింది.
టీఎన్ఆర్ అసలు పేరు తుమ్మల నర్సింహారెడ్డి కాగా టీఎన్ఆర్ గా పాపులర్ అయ్యారు. ఐడ్రీమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా టీఎన్ఆర్ ఎంతో మంది ప్రముఖ సెలబ్రెటీలను ఆయన ఇంటర్యూ చేశారు. ఇక ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖులు టీఎన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎన్ఆర్ ప్రస్తుతం సినిమాల్లోనూ రానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పాత్రలు వేసిన టీఎన్ఆర్ కు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధాకరమైన విషయం.