రియల్ హీరోకు కరోనా పాజిటివ్…అయినా మీకోసం నేనున్నానంటూ పోస్ట్..!

నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోనూసూద్ పేర్కొన్నారు. డాక్టర్ల సూచన మేరకు ఆయన ముందుగానే క్వారంటైన్ లోకి వెళ్లినట్టు వెల్లడించారు. తన ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఎవ్వరూ కంగారు పడవద్దని ఇది ప్రజల సమస్యలు తీర్చడానికి కావాల్సినంత సమయాన్ని ఇస్తుందని తెలిపారు. అంతే కాకుండా మీ అందరి కోసం నేనున్నా గుర్తుంచుకోండి అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా సోనూసూద్ కరోనా లాక్ డౌన్ వేల ఎంతో మందికి సహాయం చేశారు. ముఖ్యంగా లాక్ డౌన్ తో నగరాల్లో ఉండి పోయిన వలస కార్మికులను ఆయన తన సొంత డబ్బులతో తిరిగి వారి గ్రామాలకు పంపించారు. అంతే కాకుండా విద్యార్థులకు నిరుద్యోగులకు సైతం సోనూసూద్ చేసిన సేవలు మరవలేనివి. ఇక ఆయన చేసిన సేవలకు గానూ ప్రజలు ఆయనకు రియల్ హీరో అంటూ బిరుదునిచ్చారు. ఇక ఎంతో మందికి సహాయం చేసి వారి అభిమానాన్ని గెలుచుకున్నారు.