ప్రభాస్ అభిమానుల దెబ్బ…డార్లింగ్ పక్కన ఫోటో దిగిన సుధీర్ బాబు.!

  • Written By: Last Updated:
ప్రభాస్ అభిమానుల దెబ్బ…డార్లింగ్ పక్కన ఫోటో దిగిన సుధీర్ బాబు.!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు నటిస్తున్న “శ్రీ దేవి సోడా సెంటర్” సినిమా కు సంబందించిన ఫోటోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో చేసి “సుధీర్ బాబు విత్ స్టార్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోలో చరణ్, మెగాస్టార్, సూపర్ స్టార్, ఎన్టీఆర్, రజినీకాంత్ కాంత్ లు ఉండగా టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్ లు మిస్సయ్యారు. ఇంకేమైనా ఉందా అటు బన్నీ ఫ్యాన్స్..ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.

మా హీరోలు స్టార్ హీరోలు కాదా అంటూ సుధీర్ బాబుపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మా హీరో ప్యాన్ ఇండియా స్టార్ అని ఎలా మరిచిపోతావంటూ ఫైర్ అయ్యారు. దాంతో సుధీర్ బాబు ఆ ఫోటోను డిలీట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ తాజాగా సుధీర్ బాబు ప్రభాస్ కటౌట్ పక్కన ఫోటో దిగి డార్లింగ్ ఫ్యాన్స్ ను కూల్ చేసాడు. అయితే ఈ సారి కూడా సుధీర్ బాబు అల్లు అర్జున్ ను పక్కన పెట్టేసారు. మరి మరోసారి బన్నీ కటౌట్ తో ఫోటో దిగుతారా లేదంటే లైట్ తీసుకుంటారా చూడాలి.

follow us

Related News