మండేలా రీమేక్ లో సునీల్ ..?

తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత నెల నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందటంతో సినిమా రీమేక్ రైట్స్ కోసం పలు నిర్మాణ సంస్థలు తెగ ప్రయత్నాలు జరిపాయి. కాగా ఈ సినిమా రీమేక్ రైట్స్ ను చివరికి అనిల్ సుంకర కు చెందిన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన యోగి పాత్రలో తెలుగులో ఎవరు నటిస్తారన్నది మొదటి నుండి ఆసక్తిగా మారింది.
కొద్దిరోజులుగా ఆ పాత్రలో నిర్మాత నటుడు బండ్ల గణేష్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ పాత్ర కోసం నటుడు సునీల్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో రాజకీయ వ్యంగ్యంతో కూడిన కామెడీ ఉంటుందట. అయితే ఆ పాత్రకు సునిల్ సెట్ అవుతారని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా సునీల్ మొదట కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించి హిట్ కొట్టిన తరవాత ఆయన హీరోగా మాత్రమే చేస్తానని డిసైడ్ అయ్యారు. అయితే వరుస ఫ్లాప్ లు పడటంతో చేసేది లేక మళ్లీ కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల కలర్ ఫోటో సినిమాలో విలన్ గా సైతం నటించి అలరించారు.