రాధిక శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష..!

actors radhika sarath kumar one year imprisonment
actors radhika sarath kumar one year imprisonment

ప్ర‌ముఖ న‌టీన‌టులు రాధిక మ‌రియు శ‌ర‌త్ కుమార్ ల‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష‌ను విధించింది. 2017 చెక్ బౌన్స్ కేసులో రాధిక శ‌ర‌త్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బుద‌వారం చెన్నై కి చెందిన స్పెష‌ల్ కోర్టు తీర్పును వెలువ‌రించింది. 2014 నుండి రాధిక శ‌ర‌త్ కుమార్ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మ్యాజిక్ ఫ్రేమ్స్ నుండి రూపాయ‌లు కోటి న‌ల‌బై ల‌క్ష‌లు అప్పు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆ అప్పును తిరిగి చెల్లించ‌మ‌ని కోర‌గా రాధిక ఓ చెక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఆ చెక్ బౌన్స్ అవ్వ‌డంతో స‌ద‌రు సంస్థ ప‌లుమార్లు రాధిక శ‌ర‌త్ కుమార్ ల‌ను డ‌బ్బులు ఇవ్వాల‌ని కోరారు. కానీ వారు కాల‌యాప‌న చేయ‌డంతో నిర్మాణ సంస్థ 2017 లో కోర్టును ఆశ్ర‌యించింది.

ఇక తాజాగా బుధ‌వారం ఈ కేసుపై విచార‌ణ జ‌ర‌గ‌గా కోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. అయితే రాధిక శ‌ర‌త్ కుమార్ కు మ‌రో అవ‌కాశంగా కోర్టులో అపీల్ చేసుకునే అవ‌కాశాన్ని కూడా ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా 2017 నుండి రాధిక శ‌ర‌త్ కుమార్ ప‌లు వివాదాల‌లో చిక్కుకుంటున్నారు. అటు సినిమాల ప‌రంగానూ ఇటు వ్యాపారం ప‌రంగానూ అనేక ఆరోప‌ణ‌లు ఎదురుకుంటున్నారు. శ‌రత్ కుమార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే న‌టీన‌టుల‌కు పేమెంట్స్ స‌రిగ్గా ఇవ్వ‌డం లేద‌న్న ఆరోప‌ణలు కూడా శ‌రత్ కుమార్ పై వినిపిస్తున్నాయి. ‌