మరో కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నా: ఆనంది

  • Written By: Last Updated:
మరో కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నా: ఆనంది

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. దిల్ రాజు నుంచి మొదలుకుని మొన్న కొణిదెల నిహారిక వరకు పలువురు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ వివాహం చేసుకున్నారు. బస్‌స్టాప్ సినిమా హీరోయిన్ కాయల్ ఆనంది పెళ్లి పీటలెక్కారు. తమిళ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న సోక్రటీస్‌, కాయల్ ఆనంది వివాహం ఆమె సొంతూరు వరంగల్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఏ హంగూ ఆర్భాటం లేకుండా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో ఆనంది మెడలో వరుడు సోక్రటీస్ మూడు ముళ్లు వేశారు. ఆనంది టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో సినిమాలు చేసింది. తెలుగులో బస్‌స్టాప్ సినిమాతో పరిచయమైంది. అంతకుముందు ఈరోజుల్లో మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె నటించిన జాంబి రెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్‌లో చేసిన తొలి మూవీ కాయల్‌. అప్పటినుంచి కాయల్ ఆనందిగా మారిపోయింది. సడన్‌గా వివాహం చేసుకుని తన అభిమానులకు షాకిచ్చింది. ఆనంది ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మరో కొత్త చాప్టర్ లోకి అడుగుపెడుతున్న అంటూ తెలిపింది. కరోనా వైరస్ నిబంధనల మేరకు అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలిపింది.

follow us