డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్న హాట్ హీరోయిన్..!

  • Written By: Last Updated:
డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్న హాట్ హీరోయిన్..!

టాలీవుడ్ హాట్ బ్యూటీ అనూ ఇమాన్యులేయ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అది కూడా ఈ భామ హీరోయిన్ గా నటించిన ఆక్సిజన్ సినిమా దర్శకుడు ఏ ఎమ్ జ్యోతి కృష్ణ తో లవ్ లో ఉన్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. నిత్యామీనన్ 2017 లో ఆక్సిజన్ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు జ్యోతి కృష్ణ తో ఏర్పడిన ఫ్రెండ్ షిప్ కాస్త రిలేషన్ షిప్ వరకు వెళ్లిందట. వీరిద్దరి మధ్య 2017 నుండి రిలేషన్ షిప్ ఉండటంతో ఇప్పుడు ఆ రిలేషన్ షిప్ పీక్స్ లోకి వెళ్లి డేటింగ్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ అమ్మడు నోరు విప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక జ్యోతి కృష్ణ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత ఏ ఏం రత్నం కుమారుడే..తెలుగు లో ఆక్సిజన్ తీసిన అతడు తమిళ్ లో ఎక్కువ సినిమాలనే తెరకెక్కించాడు. ఇదిలా ఉండగా అనూ ఇమాన్యుయేల్ “మజ్ను” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ సినిమా.హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు అందుకుని ఇండస్ట్రీలో బిజీ భామగా మారింది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ప్రస్తుతం ఈ భామ కెరీర్ కాస్త డల్ గానే ఉంది. ఇలాంటి సమయంలో ఇలా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ మ్యాటర్ పై అనూ ఏమంటుందో చూడాలి.

follow us