ది డర్టీ పిక్చర్ “అర్య బెనర్జీ” అనుమానస్పద మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ప్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు దారి తీసింది. సుశాంత్ మరణ వార్తా అప్పట్లో ఓ సెన్సెసన్ అయ్యింది. ఆ సమయంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.
డ్రగ్స్ మాఫియా కు సంబందించిన పలువురు నటి, నటీమణుల పేర్లు బయటపడ్డాయి. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ అర్య బెనర్జీ కోల్‌కతాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఉదయం పని మనిసి వచ్చి తలుపు డోర్ కొడుతుంటే ఎంతకి తెరవకపోయేసరికి. ఆమెకు అనుమానం వచ్చి పోలీసు లకు ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసు లు తలుపు బద్దలు కొట్టి తెరిచి చూసే సరికి ఆమె బెడ్ పై శవమై కనపడింది. ఆమె ముఖం, పై గాయాలు కనపడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసు లు ఎంక్వెరీ చేస్తున్నారు. ఆమె కొంతకాలంగా ఒంటరిగానే జీవిస్తుందని పనిమనిసి చెప్పింది.
ఆమె మరణం వార్త తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అర్య బెనర్జీ మరణంతో బాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె గతంలో విద్యాబాలన్ తో కలిసి ది డర్టీ పిక్చర్ అనే సినిమాలో నటించింది.