ప‌వ‌న్ క‌ల్యాణ్ నా కోసం క‌విత‌లు రాసేవారు..న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

  • Written By: Last Updated:
ప‌వ‌న్ క‌ల్యాణ్ నా కోసం క‌విత‌లు రాసేవారు..న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ లో గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన హంగామా సినిమాలో జ్యోతి హీరోయిన్ గా నటించింది. ఆ తరవాత పెళ్ళాం ఊరేలితే కొంటె కుర్రాళ్ళు లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లోనూ కంటెస్టెంట్ గా వచ్చి ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యణ్ తనపై కవితలు రాసి మెసేజ్ చేసేవారని తెలిపింది. అబ్బాయిలు ఫ్లర్ట్ చేయాలని చూడటం సహజం అని చెప్పింది.

అయితే పవన్ కల్యాణ్ ఫన్ కోసం మాత్రమే అలా చేసేవారని చెప్పింది. అప్పుడు పవన్ పక్కన్ తో నటించానని ఇప్పుడు కూడా ఆయన సినిమాలో అవకాశం వస్తే బాగుండేదని తెలిపింది. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పింది. తనకు 18 ఏళ్లకే వివాహం జరిగిందని అయితే కానీ తన భర్త విడిచిపెట్టి ఆమెరికాలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అంతే కాకుండా తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇప్పుడు తన బాబు చూస్కుంటూ లైఫ్ ను గడిపేస్తున్నానని పేర్కొంది.

follow us