ఎమ్ ఎస్ నన్ను గదిలోకి లాగారు..నటి సంచలన వ్యాఖ్యలు..!

actress padma jayanthi sensational comments on ms narayana
actress padma jayanthi sensational comments on ms narayana

దివంగత నటుడు ఎమ్ ఎస్ నారాయణ పై సీనియర్ ఆర్టిస్ట్ పద్మ జయంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఎమ్ ఎస్ తాగిన మత్తులో గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసారని తెలిపింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో జయంతి మాట్లాడుతూ..నేను ఓ సినిమా షూటింగ్ కోసం సెట్ లో ఉన్నప్పుడు ఎమ్ ఎస్ వెనక నుండి వచ్చి నా చెయ్యి పట్టుకుని లాగారు. నేను ఎందుకు ఎక్కడికి సార్ అని అరుస్తున్నా వినిపించుకోలేదు. ఆయన దగ్గర మందు వాసన కూడా వచ్చింది.

దాంతో నేను గట్టిగా అరిచేసరికి ఆయన నాపై దుర్భాశలాడారు. దాంతో నేను ఆయన పీక పట్టుకుని లేపాను. ఆయన అరవడం తో యూనిట్ సభ్యులు వచ్చి ఆపారు. జరిగిన విషయం చెపితే ఆయన పెద్ద నటుడు ఈ విషయం ఇక్కడితే వదిలేయండి అని చెప్పారు. కానీ ఇష్యూ పెద్దదైంది. నేను యూనియన్ లో కూడా ఫిర్యాదు చేసాను. కాని పెద్దలు నన్నే బెదిరించారు. ఆయన తో పెట్టుకుంటే అవకాశాలు రావన్నారు. ఒక 10 సినిమాలు కూడా నా చేతి నుండి జారిపోయాయి. ఆ తరవాత కొన్నాళ్ళకు అంతా మర్చిపోయారు. మళ్ళీ నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.” అంటూ పద్మ జయంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.