కొత్త ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ

  • Written By: Last Updated:
కొత్త ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ

శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది హీరోయిన్ పూర్ణ. ఈ సినిమా తరువాత పలు హిట్ సినిమాల్లో నటించినా పూర్ణకు మాత్రం స్టార్ స్టేటస్ అందలేదు. ఇక దీంతో బుల్లితెరపై ఒక డ్యాన్స్ షో కు జడ్జి గా వెళ్లి అక్కడ ఫేమస్ అయ్యింది. అడపాదడపా సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మూడు నెలల క్రితం పూర్ణ దుబాయ్ బిజినెస్ మ్యాన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహమాడిన విషయం విదితమే. దుబాయ్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

పెళ్లి తర్వాత కూడా పలు షోలలో కనిపించి మెప్పించిన పూర్ణ కొత్త సంవత్సరం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తాను తల్లిని కాబోతున్నాను అని అధికారికంగా ప్రకటించింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పూర్ణ ప్రకటించింది. ఈ సంతోషాన్ని కన్నవారితో పంచుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. పూర్ణ తల్లి కాబోతుంది అని ప్రకటించడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి పూర్ణ తల్లి అయ్యాకా ఇక్కడే ఉంటుందో.. దుబాయ్ లో సెటిల్ అవుతుందో చూడాలి.

follow us