హైదరాబాద్ కు ఆదిపురుష్ ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఒకటి “ఆది పురుష్”. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సినిమాలో రావన్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదటి నుండి షూటింగ్ ను ముంబై లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఇప్పడు షూటింగ్ ను కొనసాగించాలని చిత్ర యూనిట్ భావించినట్టు తెలుస్తోంది. కానీ ముంబై లో పరిస్థితులు ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ భావించారు. అందుకోసం ఇప్పటికే మేజర్ షూట్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారట. అంతే కాకుండా ఇక్కడే మూడు నెలల పాటు షూటింగ్ ను జరపబోతున్నారట. ఇక 3 నెలలు ఇక్కడే ప్లాన్ చేశారంటే ఏమేరకు షూట్ ను పూర్తి చేస్తారో అర్థం చేసుకోవచ్చు.