మహేష్ కాల్ తో అడివి శేష్ కన్నీరు

అర్ధరాత్రి మహేష్ నుండి మూడు మిస్ కాల్స్..తిరిగి కాల్ బ్యాక్ చేయగా..ఆయన మాటలకు కన్నీరు ఆగలేదని హీరో అడివి శేష్ ఎమోషనల్ అయ్యారు. తాజాగా అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ..అడివిశేష్ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబడుతుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడం తో మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్‌లో అడివి శేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు. ‘‘రిలీజ్‌కి ముందు రోజు రాత్రి కొంత మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం అన్నపూర్ణలో హిట్-2 మూవీ ప్రైవేట్ షో వేశాం. సాధారణంగా అలా ప్రైవేట్ షో ముగిసిన తర్వాత మిక్స్‌డ్ టాక్ చెప్తుంటారు. కానీ.. అందరూ పాజిటివ్‌గా స్పందించారు. రాత్రి 2 గంటలకి యుఎస్ ప్రీమియర్ చూసిన కొంత మంది ట్విట్టర్‌లో వాళ్ల అభిప్రాయాలు చెప్పారు. కానీ.. ఎక్కడా ట్విస్ట్‌లు చెప్పకపోవడం సంతోషం. పాజిటివ్ టాక్ వస్తోంది.. అయితే రివ్యూ రావడానికి టైమ్ పడుతుందని నిద్రపోయా. అయితే.. సడన్‌గా ఫోన్ వరుసగా మోగుతోంది. దాంతో చెక్ చేస్తే? మహేష్ బాబు నుంచి మూడు మిస్డ్‌కాల్స్ కనిపించాయి’’
‘‘నాకు ఏమీ అర్థం కాలేదు.. ఏమైనా జరిగిందేమో? లేదా ఏదైనా అవసరం ఉందేమో? అని టెన్షన్ పడుతూ.. రిటర్న్ కాల్ చేసి సార్ చెప్పండి అన్నాను. ‘ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు శేష్’ అని ఒకే ఒక మాట మహేష్ బాబు అన్నారు. నేనేమో ‘సార్.. ఆల్ ఓకే’ అని అడిగాను. ఆయన మళ్లీ ఆ మాటే చెప్పారు. దాంతో నాకే తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి. మీరు ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోయారు సార్. కానీ.. మీకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అని చెప్పా’’ అని అడవి శేష్ చెప్పుకొచ్చాడు.