మేజ‌ర్ టీజ‌ర్..దేశాన్ని ప్రేమించడం అందరి పని వాళ్ళని రక్షించడం షోల్జర్ పని..!

adivi sesh major teaser released
adivi sesh major teaser released

ప్రస్తుతం అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శశికిరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై పేలుళ్లలో అమరుడైన మేజర్ అన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ మలయాల భాషల్లో మేజర్ జులై 2 న విడుదల కాబోతోంది. సినిమాలో అడవి శేష్ సరసన హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ,రేవతి, మురళి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనర్స్ బ్యానర్ పై మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను తాజాగా మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసారు. టీజర్ లో అడవి శేష్ మేజర్ సందీప్ పాత్రలో అలరించారు. దేశ భక్తి నేపథ్యంలో ఉన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “బార్డర్ లో ఆర్మీ ఎలా గెలవాలి…ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని అందరూ ఆలోచిస్తారని..అదీ దేశభక్తే దేశాన్ని ప్రేమించడం అందరి పని వాళ్ళని రక్షించడం షోల్జర్ పని.” అంటూ ఉన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక జలై 2న విడుదల కూడా సిద్ధంగా ఉన్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.