టెర్రరిస్ట్ లపై గన్ గురి పెట్టిన మేజర్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సినిమాలోకి అడుగు పెట్టిన అడివి శేషు, ఆ తర్వాతి కాలంలో హీరోగా మారి తనదైన స్టయిల్ లో డిఫ్ఫరెంట్ కన్సెప్ట్స్ తో వస్తు అందరిచే ప్రశంశలు అందుకుంటున్నాడు. తాజాగా ఆయన శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో మేజర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతుంది.
ముంబయి లోని తాజ్ హోటల్ లో 26/11 తేదీన జరిగిన టెర్రర్ ఎట్టాక్ అందరికి గుర్తుండే పోతుంది. ఆ సమయంలో మేజర్ ఉన్ని కృష్ణన్ శత్రువులను చంపి తాను కూడా టెర్రరిస్ట్ ల తుటాలకు బలై పోతాడు. ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని మేజర్ అనే చిత్రాన్ని సోని పిక్చర్స్ అండ్ మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తుంది.
మేజర్ ఉన్ని కృష్ణన్ గా అడవిశేషు నటిస్తున్నాడు. మేజర్ చిత్రంనకు సంబందించిన ఆయన లుక్ ను సోషల్ మీడియాలో విడుదల చెయ్యడం జరిగింది. ఫస్ట్ లుక్ విడుదల చేసి ఫస్ట్ ఇంప్రెషన్ ను ప్రేక్షకులనుండి అడవి శేషు కొట్టేశాడు. ఈ ఫస్ట్ లుక్ లో షార్ప్ అయినా తన కంటి లుక్ తో టెర్రరిస్ట్ లపై గన్ గురి పెట్టి షూట్ చేస్తున్నట్లుగా అడవిశేషు కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హింది, తదితర బాషలలో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం 2021 సమ్మర్ లో విడుదల కానున్నది.