టాలీవుడ్ మళ్లీ ఓటీటీ బాట పట్టాల్సిందేనా..?

కరోనా ఫస్ట్ వేవ్ తో వచ్చిన లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. దాంతో అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కరోనా పుణ్యమా అని ప్రేక్షకులకు ఓటీటీ రుచిని చూపించే ఛాన్స్ అమెజాన్ నెట్ ఫ్టిక్స్ లాంటి ఓటీటీ సంస్థలకు వచ్చింది. ఇక ఆ అవకాశాన్ని కూడా ఓటీటీ సంస్థలు సద్వినియోగం చేసుకున్నాయి. విడుదల ప్రశ్నార్థకంగా మారిన సినిమాలను మంచి ధర ఇచ్చి విక్రయించాయి. అలా చిన్న సినిమాలతో పాటు బడా సినిమాలు కూడా ఓటీటీలో విడుదలయ్యాయి. దాంతో ఓటీటీ క్రేజ్ కూడా పెరిగిపోయింది. కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోనే రావడంతో ప్రేక్షకులు కూడా ఓటీటీకి దగ్గరయ్యారు.
అయితే పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీని నమ్ముకుంటే నష్టాలు తప్పవు. నష్టాలు రాకపోయినా థియేటర్ల లో వచ్చినన్ని లాభాలు మాత్రం వరించవు. ఇదిలా ఉండగా మళ్లీ కరోనా టెర్రర్ మెదలైంది. దాంతో సినిమా థియేటర్లకు జనాలు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఏపీలో 50 సీటింగ్ ను అమలులోకి తీసుకువచ్చారు. తెలంగాణలోనూ రేపో మాపో అనౌన్స్ మెంట్ రాబోతుంది. కరోనా కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో థియేటర్లు పూర్తిగా మూతపడినా ఆశ్చర్యం అవసరంలేదు. దాంతో మళ్లీ టాలీవుడ్ ఓటీటీ బాట పట్టక తప్పదనే అనిపిస్తుంది.