ఫిబ్రవరి లో ఏజెంట్ ను వదులుతారట..

ఫిబ్రవరి లో ఏజెంట్ ను వదులుతారట..

సురేందర్ రెడ్డి – అఖిల్ కలయికలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం ఏజెంట్. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం..మళ్లీ కొంతభాగం రీషూట్ చేయడం జరిగింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం నిర్మాతలు తర్జనభర్జనలు అవుతూ వస్తున్నారు. మొన్నటి వరకు సంక్రాంతి బరిలో సినిమాను తీసుకొస్తారని అంత భావించారు. కానీ సంక్రాంతి బరిలో బాలయ్య , చిరంజీవి , విజయ్ లు పోటీపడుతుండడం తో ఏజెంట్ ను పక్కకు పెట్టారు. కానీ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారట.

ఏజెంట్ సినిమాను సంక్రాంతి సీజన్ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారట. సాదారణంగా తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల చేసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. కానీ ఏజెంట్ నిర్మాతలు మాత్రం ఫిబ్రవరి లోనే రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట. మరి అప్పుడైనా రిలీజ్ చేస్తారో..లేక మరో వాయిదా వేస్తారో చూడాలి. ఈ సినిమాలో కీలక పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ చేస్తూ ఉండగా.. హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది.

follow us