పుష్ప లో ఐష్య‌ర్య రాజేష్ రోల్ అదేన‌ట‌..?

  • Written By: Last Updated:
పుష్ప లో ఐష్య‌ర్య రాజేష్ రోల్ అదేన‌ట‌..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ర‌ష్మిక మంద‌న హీరో హీరోయిన్ లు గా న‌టిస్తున్న సినిమా పుష్ప‌. ఈ సినిమాకు సుకుమార్ దర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ష‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ సినిమాలో బ‌న్నీ లారీ డైవ‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. అంతే కాకుండా గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఐష్య‌ర్య రాజేష్ న‌టిస్తుందంటూ కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు ఐశ్వ‌ర్య రాజేష్ అల్లు అర్జున్ కు సోద‌రిగా న‌టించ‌బోతుందంటూ టాక్ వినిపిస్తోంది.

అంతే కాకుండా సినిమాలో అల్లు అర్జున్ కు సోద‌రిగా న‌టించ‌బోయే ఐశ్వ‌ర్య చ‌నిపోంతుంద‌ట‌. ఆమె మృతికి ఓ పోలీస్ ఆఫీసర్ కార‌ణమ‌వుతార‌ట‌. దాంతో పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టిస్తున్న అల్లు అర్జున్ ఎలా ప‌గ‌తీర్చుకుంటార‌న్న‌దే ఈ సినిమా క‌థాంశమట‌. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉన్న‌దో తెలియాలంటే సినిమా విడుద‌ల‌య్యేవ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. టీజ‌ర్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ తో ఆక‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్ కు 40 మిలియ‌న్ కు పైగా వ్యూవ్స్ కూడా వ‌చ్చాయి.

follow us