గాయాలను లెక్క చెయ్యకుండా షూటింగ్ హాజరు అయిన హీరో

  • Written By: Last Updated:
గాయాలను లెక్క చెయ్యకుండా షూటింగ్ హాజరు అయిన హీరో

తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో అజిత్ ఒక్కరు. గతంలో అజిత్ హీరో గా, వినోత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయం దక్కించుకోవడం తో మరలా ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘వాలిమై’అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోణి కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అజిత్ బైక్ స్టంట్స్ చేస్తుండగా జారీ కిందపడిపోవడం తో చేతి వెళ్లకు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. ఆ పై వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి చికిత్స తీసుకున్నాడు. కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించిన అవేమీ లెక్క చెయ్యకుండా మరుసటి రోజే షూటింగ్ లో పాల్గొన్నాడు.

అజిత్ కు సినిమా పై ఉన్న డెడికేషన్ చూసి చిత్రా యూనిట్ అభినందనలు కురిపిస్తుంది, ఇంకా అజిత్ ఫాన్స్ మాత్రం తమ హీరోకు ఉన్న పట్టుదలను చూసి గర్వంగా అందరితో చెప్పుకుంటున్నారు. ఫైట్ మాస్టర్ దీలిప్ సుబ్రమణ్యం అధ్వర్యంలో అజిత్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకో 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ తరువాత డిసెంబర్ లో జరిగే చివరి షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి అవ్వుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. 2021 లో వేసవిలో విడుదలకు సిద్దం అవ్వుతుంది.

follow us