కొరటాల డైరెక్షన్ లో అఖిల్..?

అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు సినిమాలు చేసినా సరైన హిట్ అందకోలేపోయారు. మొదటి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ కాగా ఆ తరవాత వచ్చిన హలో సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఆ తరవాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాపై ఎన్నో అంచనాలున్నప్పటికీ అది కూడా బోల్తాపడింది. దాంతో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక అఖిల్ నాలుగో సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగానే అఖిల్ ఐదో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఏజెంట్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా నుండి అఖిల్ లుక్ విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంది. ఊరమాస్ లుక్ లో అఖిల్ కనిపింస్తుండగా ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు అఖిల్ ఆరో సినిమాకు సంభందించిన ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. అఖిల్ ఆరో సినిమా కోసం నాగార్జున టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైన కొరటాలను నాగార్జున సంప్రదించారట. అంతే కాకుండా కొరటాల కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు టాక్. ఇక అంతా అనుకున్నట్టు జరిగితే అఖిల్ కొరటాల కాంబినేషన్ లో సినిమా రావడం పక్కా.