అఖిల్ సురేందర్ రెడ్డి సినిమా టైటిల్ ఇదే..!

అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. సినిమాలో ఫైట్ లు ,డ్యాన్స్ లు ఇరగదీసినా లాభం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉండగానే అఖిల్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సంధర్బంగా ఎప్రిల్ 8న ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను “ఏజెంట్” గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అఖిల్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.