చిరు ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు.. అతిథిగా అక్కినేని

  • Written By: Last Updated:
చిరు ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు.. అతిథిగా అక్కినేని

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున కూడా చేరిపోయారు. హైద‌రాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ క‌చేరితో, రుచిక‌ర‌మైన ఫుడ్ ను ఆర‌గిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు. చిరంజీవి, నాగార్జున‌తోపాటు రాంచ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా చిరు-నాగ్, యువ హీరోలు ఇలా ఒకే ఫ్రేమ్ లో క‌నిపించేస‌రికి ఆనందంలో మునిగితేలుతున్నారు అభిమానులు. పండ‌గ‌ల స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఒక్క‌చోట చేరి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటార‌ని తెలిసిందే.

follow us