అయోధ్య రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం

అయోధ్య రామ మందిరం నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామాజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. కాగా తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం మందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని అక్షయ్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. వీడియోలో అక్షయ్ మాట్లాడుతూ…మందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చానని తెలిపారు.
దేశ ప్రజలందరూ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని కోరారు. దానికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా విరాళాలు ఇవ్వాలని అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చిన మొదటి హీరోగా అక్షయ్ నిలిచారు. మరోవైపు ఇప్పటికే నటి ప్రణీత మందిర నిర్మాణం కోసం 1 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇదిలా ఉండగా మూడు రోజుల్లోనే ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం వచ్చినట్టు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.