అల వైకుంఠపురంలో రివ్యూ : సంక్రాంతి బ్లాక్బస్టర్ బొమ్మ

  • Written By: Last Updated:
అల వైకుంఠపురంలో రివ్యూ : సంక్రాంతి బ్లాక్బస్టర్ బొమ్మ

కథ :

అల్లు అర్జున్ గ్యాప్ తీసుకొని నా పేరు సూర్య తరువాత ఒక ఇయర్ మిస్ చేసి వస్తున్న సినిమా  అల వైకుంఠపురంలో.  మరి ఇంత గ్యాప్ తీసుకొని మన స్టైలిష్ స్టార్ట్ డిస్పాయింట్ చేస్తాడా చెప్పండి, అస్సలు చేయలేదు.. ఫ్యాన్స్ నే కాదు అందరిని మెప్పించాడు.. 

ఒకే కంపెనీ లో పని చేసే ఇద్దరు ఉద్యోగులు , రామచంద్ర మరియు వాల్మీకి.. ఒకరికి అదృష్టం బాగుండి కోటీశ్వరుడు అవ్వుతాడు, తాను పని చేసే కంపెనీకే  సీఈఓ అయ్యిపోతాడు… అది చూసి ఓర్వలేని వాల్మీకి తనకు పుట్టిన కొడుకుని రామచంద్ర కొడుకుని హాస్పిటల్ లోనే మార్చేస్తాడు.. ఈ విషయం తెలిసిన నర్స్ కోమాలో ఉంటుంది.. అల్లు అర్జున్ ( బంటు ) తిరిగి పెద్ద అయ్యాక ఎలా తన స్థానం లోకి చేరాడు అనేది కథ.. 

నైపుణ్యత :

చెప్పుకోడానికి పెద్ద ఏమి లేక పోయిన కథ లో.. త్రివిక్రమ్ ఈ కథ ను తెరకు ఎక్కించిన తీరు చాలా బాగుంది.. త్రివిక్రమ్ మార్క్ కామెడీ లేదు కానీ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మాత్రం పడ్డాయి.. వాల్మీకి , బంటు మధ్య సాగే తండ్రి కొడుకుల సంభాషణలు బాగా వచ్చాయి.. 

బంటు గా అలానే వైకుంఠపురం వారసుడు గా అసలు బన్నీ వొదిగి పోయాడు.. గ్యాప్ ఇచ్చిన కానీ అందరూ నా పేరు సూర్య లో చుసిన బన్నీ ని మర్చిపోయి పాత బన్నీ ని గుర్తు తెచ్చుకుంటారు.. 

పూజ హెగ్డే (అమూల్య ) ఆఫీస్ లో బంటు జాయిన్ అవ్వడం.. అమూల్య కంపెనీ ని టేకోవర్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళని హీరో ఎలా ఎదురుకున్నాడు అలాంటివి అన్ని చాలా బాగా వచ్చాయి.. టబు ఎప్పటిలానే అందంగా హీరో కి తల్లి పాత్రలో చాలా బాగా పాత్రలో లీనమైపోయారు…

చెప్పుకోడానికి మైనస్లు ఏమి లేక పోయిన కానీ విలన్ చారెక్టర్ ని ఎలివేట్ చేయడం మాత్రం కుదరలేదు అనే చెప్పాలి దర్శకుడుకి.. 

విశ్లేషణ : 

త్రివిక్రమ్ మార్క్ ఎక్కడ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంటుంది.. మనం అలా ఫీల్ అయ్యే లోపు బంటు ( హీరో ) మనకి ఆ ఫీలింగ్ పొగడతాడు.. హీరోయిన్ గా పూజ హెగ్డే చాల అందం గా ఉంది..  ఇంకా నివేద పేతురాజ్ కనిపించిన కొంచెం సేపు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది సుశాంత్ లవ్ ఇంటరెస్ట్ గా .. నవదీప్ పాత్ర అవసరం లేదు అనిపిస్తుంది..

హీరో తన కుటుంబం సమస్య లో ఉండి అని తెలుసుకొని తన కుటుంబం లోకి వెళ్ళడానికి ప్రయత్నించే సన్నివేశాలు చాలా బాగా తీసాడు త్రివిక్రమ్.. రాములో  రాములా పాట అలానే బుట్ట బొమ్మ పాటలు సినిమా లో మెయిన్ హై లైట్ గా  చెప్పుకోవాలి.. అంత బాగా వచ్చాయి.. 

పోసిటివ్స్ 

అల్లు అర్జున్
హై బడ్జెట్ ప్రొడక్షన్ వేల్యూ క్యాస్టింగ్ 

మైనస్లు : 

విల్లన్ రోల్
సెకండ్ హాఫ్ స్లో

మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి పండగక్కి ఇదే కరెక్ట్ సినిమా అని చెప్పాలి.. 

సినీ చిట్ చాట్ : 3/5

follow us

Web Stories