‘అల’ స్టోరీ నాది… త్రివిక్రమ్ కాపీ కొట్టారు

Ala Vaikunthapurramu loo
Ala Vaikunthapurramu loo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన’ అల వైకుంఠపురంలో ‘ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొటింది. అల్లు అర్జున్ కెరియర్ లో మైల్ స్టోన్ గా  ఆల్  టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది “అలవైకుంఠపురం”.  అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు ఇప్పుడు ఒక సమస్యవచ్చి పడింది. 

 విషయం ఏంటంటే వేరే డైరెక్టర్ చెప్పిన కథని తీసుకొని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించాడని అని టాక్ వినిపిస్తుంది. చిన్న చిత్రాలకి రచయితగా పని చేస్తున్నకృష్ణ అనే దర్శకుడు 2005లో త్రివిక్రమ్‌ని కలిసి సేమ్ స్టోరీని నరేట్ చేశాడట. 2013లో ఈ కథని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాడట. నేను చెప్పిన కథని దశ-దిశ అనే టైటిల్‌తో తెరకెక్కించాలనుకున్నానని, కాని త్రివిక్రమ్ నా కథతో అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించాడని అంటున్నాడు. మరి ఈ వివాదం పై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.