పవన్ కు నాకు గ్యాప్ రాలేదు..కొంతమంది ఇచ్చారు అంతే – అలీ

కమెడియన్ అలీ – పవన్ కళ్యాణ్ ల మధ్య స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పవన్ నటించిన సినిమాల్లో అలీ నటించారు..ఒకటి రెండు తప్ప అంతే. ఒకానొక సమయంలో అలీ లేకపోతే చాల వెలితిగా ఉంటుందని పవన్ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. అలాంటి వీరిద్దర్నీ రాజకీయాలు దూరం చేశాయని , అలీ వైసీపీ లో చేరడంతో పవన్ అలీని దూరం పెట్టారనే వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. అంతే కాదు అలీ కూతురి పెళ్లికి కూడా పవన్ రాకపోవడానికి కారణమని ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలో అలీ వాటిపై స్పందించారు. తనకు, పవన్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, కావాలనే కొందరు గ్యాప్ క్రియేట్ చేశారని అన్నారు.
“నా కూతురు పెళ్లి శుభలేఖ పట్టుకొని స్వయంగా నేనే వెళ్లి పవన్ ను ఆహ్వానించాను. నేను వస్తానని ముందే చెప్పడంతో సెట్స్ లోనే పవన్ అన్ని ఏర్పాట్లు చేశారు. నాకు ఛైర్ వేసి టీ కూడా ఇచ్చారు. పవన్ ను నేను ఆహ్వానించాను. ఇద్దరం 15 నిమిషాలు మాట్లాడుకున్నాం, జోకులేసుకున్నాం. పవన్ పెళ్లికి వస్తానన్నారు. పవన్ మేనేజర్ వచ్చి పెళ్లి వేదిక దగ్గర ముందే అన్నీ చూసుకున్నారు. పవన్ కూడా టైమ్ ఎడ్జెస్ట్ చేసుకున్నారు. కానీ ఫ్లయిట్ మిస్సయిపోయింది” అని అలీ తెలిపారు.