ఆర్ ఆర్ ఆర్ కోసం తెలుగు నేర్చుకుంటున్న అలియా..

Alia Bhatt Is Going To Dub Her Own For RRR
Alia Bhatt Is Going To Dub Her Own For RRR

టాలీవుడ్ దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే , రామోజీ ఫిలిం సిటీ లో మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ ,  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్నారు. అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నట్లు వచ్చిన రుమోర్స్ కు నిన్న రిలీజ్ చేసిన రెస్యూమ్ వీడియో తో రుమోర్స్ కు చెక్ పెట్టాడు రాజమౌళి అయితే రెండు నెలలు కంటిన్యూయస్ సాగే ఈ షూటింగ్ లో అలియా భట్ జాయిన్ అవుతారు,  నవంబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. 

షూటింగ్ జాయిన్ అయ్యే లోపు అలియా భట్ తెలుగు నేర్చుకుంటున్నారట , ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన సీత రోల్ కి తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి తెలుగు నేర్చుకోవడానికి ఒక మాస్టర్ ని కూడా పెట్టుకున్నారు, మొత్తానికి ఈ బాలీవుడ్ భామ టాలీవుడ్ లో అడుగుబెట్టడమే కాకా తెలుగు నేర్చుకొని డబ్బింగ్చెప్పుకోవడమంటే మిగతా హీరోయిన్ లకు గట్టి పోటీ ఇచ్చినట్లే..