ర‌ణ్‌బీర్ 7th ఫ్లోర్ అలియా 5th ఫ్లోర్…అసలు విషయం ఏంటంటే ?

ర‌ణ్‌బీర్ 7th ఫ్లోర్ అలియా 5th ఫ్లోర్…అసలు విషయం ఏంటంటే ?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. వీళ్ళ ప్రేమకు వాళ్ళ పెద్దలనుండి అంగీకారం కూడా లభించింది, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళ ఫ్యామిలి విషయానికి వస్తే.. ఆనాటి బాలీవుడ్ అందాల నటుడు రిషికపూర్ తనయుడు రణ్ బీర్ కపూర్, మహేష్ భట్ కూతురు అలియా భట్. రిసెంట్ గా అలియా ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ను కొనుగోలుచేసింది. పెళ్లి తర్వాత ఆ జంట అందులోనే కాపురం చెయ్యబోతున్నారు. 2460 చదరపు అడుగుల గల ఆ ఫ్లాట్ ను బాలీవుడ్ హీరో షారుఖాన్ భార్య గౌరి ఖాన్ కు ఇంటీరియర్ డిజైన్ బాద్యతను అప్పగించింది.

అలియా కొన్న ఆ ఫ్లాట్ విలువ 32 కోట్లు. అదే అపార్ట్మెంట్ లో ప్రియుడు 7th ఫ్లోర్ లో ఉంటే అలియా 5 th ఫ్లోర్ లో ఉంటుంది.పెళ్ళికి ముందే భర్తను సర్ప్రైజ్ చెయ్యబోతుంది అలియా, మరి రణ్ బీర్ కూడా ఎలాంటి గిఫ్ట్ ను ఇవ్వబోతున్నాడో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రిషికపూర్, మహేష్ భట్ ఫ్యామిలి కలయికతో వారి మధ్య బందం బలపడనున్నది. ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం బ్ర‌హ్మాస్త్ర, త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీ గా నటిస్తుంది. జక్కన సినిమాతో అలియా తెలుగు సినిమా కు పరిచయం అవ్వుతుంది.

follow us