REVIEW : నరేష్ విజయానికి “నాంది”.!

ALLARI NARESH NAANDHI MOVIE REVIEW
ALLARI NARESH NAANDHI MOVIE REVIEW

కామెడీ సినిమాలతో వసూళ్ళు కురిపించే హీరో అల్లరి నరేష్. అయితే ఈ యంగ్ హీరో కొన్ని రోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అయితే ఎప్పుడూ కామెడీ సినిమాలే చేసే అల్లరి నరేష్ అప్పుడప్పుడూ సీరియస్..ఎమోషనల్ డ్రామాలతో వచ్చి పలకరిస్తూ ఉంటాడు. ఈ సారి కూడా అలాంటి ప్రయోగమే చేస్తూ తీసిన సినిమా “నాంది”. తాజాగా ఈరోజు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.

కథ : బండి సూర్య ప్రకాష్ అలియాస్ సూర్య ( అల్లరి నరేష్) కు చిన్నప్పటి నుండి తల్లి తండ్రులు అంటే ఎంతో ఇష్టం. తన చదువు కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారని సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించి తన తన తల్లి తండ్రులను భాగా చూసుకోవాలని అనుకుంటాడు. కష్టపడి ఉద్యోగం సంపాదించిన సూర్య జీవితంలో హ్యాపీగా సెటిల్ అవుతాడు. ఇక తల్లి తండ్రులు అతడికి పెళ్లి చేయాలని..అమ్మాయిని చూస్తున్న తరుణంలో అతడి జీవితంలో జరిగిన అనుకోని సంఘటన అతడి జీవితాన్నే అతలా కుతలం చేసేస్తోంది.సూర్య పొరహక్కుల నేత రాజగోపాల్ హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. చెయ్యని నేరానికి సూర్యపై తప్పుడు కేసు బనాయించి ఏసీపీ అతడిని కటకటాల్లోకి నెడతాడు. అంతే కాకుండా తప్పుడు కేసులు పెట్టించి ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపేలా టార్చర్ పెడతాడు. ఈ క్రమంలో సీన్ లోకి లాయర్ ఆద్య (వరలక్ష్మి శరత్ కుమార్) ఎంటర్ అవుతుంది. ఈ కేసులో సూర్య తరపున పోరాడి అతడిని భయటకు తీసుకువస్తుంది. అలా కేసు నుండి భయట పడ్డ సూర్య ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. అసలు తప్పుడు కేసులో ఏసీపీ అతడిని ఎందుకు ఇరికిస్తాడు. ఆద్య సూర్య కోసం అందుకు పోరాడుతుంది అన్నదే అసలు కథ.

విశ్లేషణ : ఈ సినిమాను పీనల్ కోడ్ లోని ఆర్టికల్ 211 సెక్షన్ ను బేస్ చేసుకుని దర్శకుడు తెరకెక్కించాడు. ఎంతో క్లిష్టమైన అంశాన్ని సింపుల్ గా చూపించడంలో దర్శకుడు విజయ్ కనకమేడల సఫలమయ్యాడు. నిజానికి విజయ్ కి ఇది డెబ్యూ సినిమా అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా తెరకెక్కించాడు. సినిమాలో చట్టంలోని లొసుగులను ఉపయోగించి రాజకీయ నాయకులు ఎలా తప్పటడుగులు వేస్తున్నారన్నది స్పష్టంగా చూపించాడు. ఇక ఈ సినిమాలో నటీ నటుల పర్ఫామెన్స్ సూపర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నరేష్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో ఎడిపించేస్తాడు. వరలక్ష్మి కూడా లాయర్ గా ఆధరగొట్టింది. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా భాగున్నాయి. స్క్రీన్ ప్లే స్పీడ్ గా ఉండటంతో ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలో పాటలు భాగలేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. మొత్తానికి ఈ సినిమా నరేష్ కెరీర్ లో ఒక బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.