ఓటీటీ లో “నాంది”..రైట్స్ సొంతం చేసుకున్న జీ స్టూడియోస్

  • Written By: Last Updated:
ఓటీటీ లో “నాంది”..రైట్స్ సొంతం చేసుకున్న జీ స్టూడియోస్

అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదటి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అయితే కొంతకాలంగా హిట్స్ లేక ఈ యంగ్ హీరో సతమతమవుతున్నాడు. రీసెంట్ గా జనవరి 23న విడుదలైన బంగారు బుల్లోడు సినిమా కూడా ఈ హీరోకు నిరాశే మిగిల్చింది. ఈ సినిమాలో పూజా జవేరి హీరోయిన్ గా నటించగా.. గిరి పాలిక దర్శకత్వం వహించారు. సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇదిలా ఉండగా అల్లరి నరేష్ నటించిన “నాంది” చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విధాలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జైల్లో జరిగే సస్పెన్స్ త్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సినిమా నుండి అల్లరి నరేష్ న్యూడ్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమా డిఫరెంట్ ఉండబోతుందన్న టాక్ నడుస్తోంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. సినిమా రైట్స్ ను జీ స్టూడియోస్ 8.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సినిమాటతో అయినా నరేష్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారా చూడాలి.

follow us

Web Stories