‘నాంది’ డ‌బ్బింగ్ ప్రారంభం

‘నాంది’ డ‌బ్బింగ్ ప్రారంభం

అల్ల‌రి న‌రేష్‌ హీరోగా ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఇంటెన్స్ ఫిల్మ్ ‘నాంది’ డ‌బ్బింగ్ ప‌నులు రంజాన్ పర్వ‌దినం సంద‌ర్భంగా సోమ‌వారం మొద‌ల‌య్యాయి. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ‘ఎ న్యూ బిగినింగ్’ అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. 

సామాజిక అంశాల మేళ‌వింపుతో, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్ల‌రి న‌రేష్‌ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్ల‌రి న‌రేశ్ న‌టిస్తోన్న 57వ చిత్రం. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగే ఈ భిన్న త‌ర‌హా చిత్రానికి అబ్బూరి ర‌వి, చోటా కె. ప్ర‌సాద్‌, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, బ్ర‌హ్మ క‌డ‌లి వంటి ఉన్న‌త స్థాయి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు.

వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్ కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు: అబ్బూరి ర‌వి, సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, ఛాయాగ్ర‌హ‌ణం:  సిధ్‌, ఎడిటింగ్‌:  చోటా కె. ప్ర‌సాద్‌, క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి.

Tags

follow us