అను తో సుకుమార్ డాన్స్ మాములుగా లేదు..

అను తో సుకుమార్ డాన్స్ మాములుగా లేదు..

ప్రేమమ్ ,అ ఆ , శతమానం భవతి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అనుపమ..ఆ తర్వాత హిట్, ప్లాప్ లతో కెరియర్ ను ముందుకు సాగిస్తూ వస్తుంది. నిన్న , మొన్న వచ్చిన హీరోయిన్లకు అగ్ర హీరోల ఛాన్స్ వచ్చినప్పటికీ..అనుకు మాత్రం ఇప్పటివరకు ఆ ఛాన్స్ రాలేదు. అయినప్పటికీ యంగ్ హీరోలకు జోడి కడుతూ పాన్ ఇండియా హిట్స్ అందుకుంటుంది. ఈ మధ్యనే నిఖిల్ సరసన కార్తికేయ 2 లో నటించి పాన్ ఇండియా హిట్ అందుకున్న అను..తాజాగా అదే నిఖిల్ తో 18 పేజెస్ మూవీ చేసి మరో హిట్ అందుకుంది.

గత వారం విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతూ థియేటర్స్ లలో రన్ అవుతుంది. ఈ సందర్బంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్ సక్సెస్ మీట్ లో సందడి చేశారు. అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమ తో కలిసి సరదాగా స్టెప్పేశారు. అంతలోనే సుకుమార్ కూడా డ్యాన్స్ ఫ్లోర్ మీదకు రావడంతో అనుపమ సుక్కూను కూడా చేయి పట్టుకుని డాన్స్ చేసేందుకు ఇన్వైట్ చేసింది.

అప్పటివరకు అల్లు అరవింద్‌తో కలిసి స్టెప్పేసిన అనుపమ .. ఆ తరువాత అల్లు అరవింద్, సుకుమార్‌లతో కలిసి సరదాగా డాన్స్ చేసి సక్సెస్ మీట్‌కి హాజరైన వారిని ఆకట్టుకుంది. నిఖిల్ కూడా వారితో కలిసి స్టెప్పేస్తూనే ఈ మొత్తం దృశ్యాన్ని తన మొబైల్లో షూట్ చేసి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

follow us