సూపర్ స్టార్ మూవీ లో అల్లు అర్జున్ కూతురు..?

సూపర్ స్టార్ మూవీ లో అల్లు అర్జున్ కూతురు..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ..సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ లో నటిస్తుందా..? ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు గా..మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..మొదటి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. డాన్స్ లలో మెగాస్టార్ కు సమానం అనే గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్..పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు.

సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో పుష్ప రాజ్ గా యావత్ మెగా అభిమానులనే కాదు యావత్ సినీ అభిమానులను మెప్పించాడు. ఈ సినిమా తో తన స్థాయి మరింత పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు తన ముద్దుల తనయ అల్లు అర్హ ని సైతం ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాడు. సమంత-గుణశేఖర్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలంలో అర్హ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉండగానే సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే మహేష్ 30 వ చిత్రంలో అల్లు అర్హ ఓ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకొని ఇండియా వచ్చిన మహేష్ త్వరలో త్రివిక్రమ్ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. పలు కారణాలతో అనుకున్న సమయానికి ఈ చిత్రం సెట్స్ పైకి రాలేకపోయింది. సంక్రాంతి తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి..ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హగ్దే మెయిన్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ ధమాకా ఫేమ్ శ్రీలీల ను ఎంచుకున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, నాగ వంశీ నిర్మాత. మరి ఈ మూవీ లో అల్లు అర్హ ఏ పాత్రలో కనిపిస్తుందో చూడాలి.

follow us